చెప్పవే! అతనికి
చెప్పవే! అతనికి
ఓ మల్లె పువ్వా! నా మనసులో మాటను
చెప్పవే! అతనికి
నా మనసు మాటకి, నీ పరిమళాన్ని జోడించి చెప్పవే! అతనికి
నా మనసు స్వచ్చమని, నీ వర్ణాన్ని చూపించి చెప్పవే! అతనికి
నా లోని సిగ్గును, నీవు మొగ్గవై ముడుచుకుని చెప్పవే! అతనికి
నాలోని ప్రేమను, నువ్వు పువ్వువై వికసించి
చెప్పవే! అతనికి
అతనిలోని ప్రేమను తెలుపుతూ..
పూదండవై రావే! నాదరికి.

