చెప్పు ప్రియా
చెప్పు ప్రియా
నీ కళ్ళల్లో పలికిస్తావు కోటి అర్ధాలను అన్నావు
చేతి వ్రాతలో చెప్పాలా ?
నీ మనసుతో తెలుపుతావు శతకోటి భావాలను అన్నావు
మరి నా మనసులోని అలజడి
నీ మనసుకి చేరలేదా
నీ మనసుని నా ప్రేమతో నింపలేదా?
లేక నా మనసులోని తడి ఎక్కువ నీ మనసుని కదిలిస్తుందో అని
ఏమి తెలియనట్లు నటిస్తున్నావా
చెప్పు ప్రియా ఇప్పటికైనా మనసు విప్పి చెప్పు

