STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చెప్పకిపుడు

చెప్పకిపుడు

1 min
10



గోవర్ధన గిరినెత్తిన..సూక్ష్మమేదొ చెప్పకిపుడు..! 
మంత్రివరుల చిత్తశుద్ధి..జరిగేలా చూడుమిపుడు..! 

అప్డేటెడ్ 'ఏ-ఐ'తో..ఎంతమేలు కలిగేనో.. 
నీ గీతా తత్వసుధా..సారమేదొ పంచుమిపుడు..! 

రక్కసులను ఎందరినో..దునుమాడిన ఘనతనీది.. 
సుదరిశన చక్రశక్తి..పట్టుతీరు పెంచుమిపుడు..! 

సత్యభామ మనోరథం..తీర్చినదే నిజమైతే.. 
నేటి మహా నరకాసుర..సంహారం చేయమిపుడు..! 

ఒక తులసీ దళమునకే..తూగినావు నాడు సరే.. 
బంగారపు వ్యామోహం..కాల్చివేసి చూపుమిపుడు..! 

నీ లీలలు అమోఘమే..సందేహం ఏమిలేదు.. 
"సంభవామి యుగేయుగే"..అన్నావులె పుట్టకిపుడు..!


Rate this content
Log in

Similar telugu poem from Classics