చెలివలపుల
చెలివలపుల
చెలివలపుల తోటంటే..విరహానికి మక్కువలే..!
తన చూపుల వానంటే..మోహానికి మక్కువలే..!
తన మనసే ఆరాటపు..లోగిలిగా మిగిలేనా..
తనతలపుల ఊటంటే..గాయానికి మక్కువలే..!.
కొమ్మలలో కోకిలమ్మ..పొదిగేనా వసంతాన్ని..
తన కమ్మని రాగసిరులు..విశ్వానికి మక్కువలే..!
జగమంతా కల్లోలం..యుద్ధోన్మాద భీభత్సం..
మానవతను మసిచేయ..స్వార్థానికి మక్కువలే..!
ఆయుధాలతో భద్రత..శాంతినెలా కాచేనో..
ఈ క్రీడలు చూడ దేశద్రోహానికి మక్కువలే..!

