చెలిమి ❤️❤️❤️
చెలిమి ❤️❤️❤️
నిద్రాణమైన చెలిమిని లేపితే
విజృంభిస్తుంది .....
నిలదొక్కుకోగలవా
తట్టుకోగలవా
ఆకట్టుకోగలవా
చుట్టుకోగలవా
తిప్పుకోగలవా
త్యజించగలవా
స్పృశించగలవా
చివరకు కోరితే
కృశించగలవా
మరణించగలవా
ఐతే లేపు
ఆశలు రేపు
నీలోనీవు విలీనమైపో
సూన్యసంద్రంలో కరిగిపో
చండప్రచండ కిరణాల్లో
కరిగిపో
అస్తవ్యస్థ వ్యవస్థకు
దూరమైపో
చెలిఒడిలో సేదదీరిపో
రెక్కలు కట్టుకుని
విహంగంలా
చెలిమితో ఎగిరిపో
నీవోఅలౌకికానందంలో
తేలియాడుతుంటావు
అందనితీరాల్లో
సేదదీరుతుంటావు
నీవో ప్రేమికుడవు
అజరామరుడవు...