STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

చెలీ నీ సావాసం

చెలీ నీ సావాసం

1 min
326

వద్దుటా

రంగు రంగు భవనాలు

ఇంకా రంగులు మార్చే మనుషులు

ఇవేవీ వద్దుట


మత్తున ముంచే మధిర

చిత్తు చేసే వ్యసనం

ఇవేవీ వద్దుట


విదేశం వ్యాపారం

వంచనా వలయం

ఇవేవీ వద్దుట


మనసుకి ఇవేవీ వద్దుట

చెలీ నీ సావాసం మాత్రమే కావాలి

గుండెలవిసేలా నీ ఒళ్ళో తల పెట్టుకుని ఏడవాలి

గడిచిన కాలపు బాధను వదిలి

నీతో కలిసి నవ్వాలి

నువ్వు నన్ను క్షమించాలి

అంతే 

నాకదే కావాలి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract