STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలి...

చెలి...

1 min
383

ఉసురై సదా చెలిరూపమే కలవెన్నెలై బతికించులే!

కొడిగట్టినా తను ఊపిరై నను మిన్నగా‌ వెలిగించులే!!


శిశిరాలలో తరువెంతగా తలదించెనో తపియించెనో!

చితి పేడుగా తనుమారినా చిగురాశయే గెలిపించులే!!


పెనుగాలిలో చిరుదీపమే నిలవాలనే తపనెందుకో!

తెలిసేకదా.. తుదిఆశయే, కడదారిలో పిలిపించులే!!


పొగమబ్బునే గగనానికే నజరానగా భువి పంపెనా!

దివి నేలకే తనకాన్కగా చిరుజల్లునే కురిపించులే!!


ఇల 'రాకుమారుని' వేదనే మనసైన ఓ గజలయ్యెనా!

ఎద చీలినా వెదురేకదా మధురామృతం ఒలికించులే!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance