చెలి అలిగితె
చెలి అలిగితె
చెలి అలిగితె మల్లెచెండు..విసిరినట్లు ఉంటుంది..!
తను నవ్వితె పూలమబ్బు..కురిసినట్లు ఉంటుంది..!
ఉదయారుణ కాంతులనే..మురిపించే జాణలే..
తను పాటగ మదినిండగ..విరిసినట్లు ఉంటుంది..!
పిల్లగాలి ఈలలెలా..వ్రాసేందుకు అందేను..
తను చూస్తే ప్రేమలేఖ..ఇచ్చినట్లు ఉంటుంది..!
ఏటిగట్టు అందాలను..బిందెకెత్తు కొనువేళ..
తనగాజుల సవ్వడేమొ..పిలిచినట్లు ఉంటుంది..!
చక్కెరపొంగలి కొబ్బరి..కలిసి పంచుకున్నామె..
తాను రాకపోతె గుండె..ఆగినట్లు ఉంటుంది..!
నేలమీద నడుస్తున్న ..ఆకాశం నా చెలియ..
నాకోసం తను బొమ్మగ..మారినట్లు ఉంటుంది..!

