చెదలు పట్టిన బుర్రలు
చెదలు పట్టిన బుర్రలు
చెదలు పట్టిన బుర్రలు.
(ద్విరదగతి రగడ )
చేతి గడియారంబు చెప్పులోన దూరెను
నాతి నయగారాలు నవ్వుల పాలాయెను
సమయ మెట్టుల తెలియు?చాన బుర్రకు చెదలు
ప్రమదలకు మోదంబు వరలిరిట్లు శుంఠలు
చదువులందున శ్రద్ధ ఛాత్రులకు లేదాయె
పదిలమగు సంస్కృతిని పాడు బెట్టెదరాయె
కూళలను కూడుచూ గూగులమ్మల వెంట
గోలగా పరువెత్త వచ్చుచున్నది తంట!
మ్లేచ్ఛ నాగరికతలు మేలేమి చేయునట?
తుచ్ఛమౌ పనులతో తూలిపోవుదురకట!
జాతియందున పెరుగు సమస్యల వలయాలు
నీతి మరచిన వారి నీచపు వర్తనములు
తెలివితక్కువ తోడ తెలుసుకొనగజాలరు
కలలలో పొర్లుతూ కాలమున జారెదరు
చైతన్యవంతులయి సంఘముకు మేలుగా
జాతిని నడిపించుచు సౌజన్య పరులుగా
ఆదర్శవంతులయి ఆర్షధర్మము నిలిపి
మోదముగ దేశమును మును ముందుకే నడిపి
బ్రతుకు చుండిన చాలు పౌరతతిలో ఘనులు
సతతంబు విజయాన్ని సాధించి గెలిచెదరు.//
