చెడ్డ అలవాటు
చెడ్డ అలవాటు
మనిషి జీవితం పొందటం ఎంతో అదృష్టం,
ఎన్ని అవాంతరాలు వచ్చిన మనసుగతి మనోబలం చెయ్యాలి పటిష్టం |౧|
చిన్నతనం నుండి తల్లి తండ్రులు గురువులు నేర్పవలెను మంచి అలవాట్లు,
ఎప్పడూ అవి అభ్యసించెనుచో జీవితంలో కోరి తెచ్చుకొం అగచాట్లు ఇక్కట్లు |౨|
తల్లి తండ్రులుకు పిల్లల స్నేహితులపై ఉండాలి ప్రత్యవేక్షణ,
పిల్లల మారుతున్న అభ్యాసాలు వ్యవహారాలపై చేస్తూ ఉండాలి పర్యవేక్షణ |3|
ఏ ఒక్క చెడ్డ అలవాటు వ్యసనం చేశేను జీవితాన్ని ధ్వంసం,
అనంతరం అలజడి అల్లకల్లోలం ఆందోళనలతో కుటుంబం అయ్యెను విధ్వంసం |౪|
మద్యం ధూమపానం మాదక ద్రవ్యాల సేవనం కొన్ని అనవసర అభ్యాసాలు,
అంతకంటే భయంకరమైనవి లంచగొండితనం అవినీతి చోరీ పరనారి సహవాసాలు |౫|
చెడ్డ అలవాట్లు అనిపించెను దగ్గర మిత్రులు,
గ్రహించుకుంటే తెలిసెను అవి అతి క్రూర శత్రువులు |౬|