చెబుతుంది
చెబుతుంది
ఏది జననమో..ఏది మరణమో..
ప్రాణ ప్రయాణం చెబుతుంది..
ఏది కలో..ఏది కల్పనమో..
మూసే కన్నులజంట చెబుతుంది..
ఏది మొదలో..ఏది చివరో..
ఊహించే మెధస్సు చెబుతుంది..
ఏది ఆనందమో..ఏది విషాదమో..
చూసే చూపులపంట చెబుతుంది..
ఏది గమనమో..ఏది గమ్యమో..
మార్గాన్ని ఎన్నుకునే విధానం చెబుతుంది..
ఏది ఇష్టమో..ఏది ద్వేషమో..
సలహాల సంశయం చెబుతుంది..
ఏది తప్పో..ఏది ఒప్పో ..
చేసే స్వయంకృషి చెబుతుంది..
ఏది కవ్వించే కవనమో..ఏది కన్నీటి కావ్యమో..
అనుభూతి చెందే మనసు చెబుతుంది..
ఏది పాశమో..ఏది బంధమో..
అల్లుకుపోయే అనుబంధం చెబుతుంది..
ఏది గతమో..ఏది భవిష్యత్తో..
వేసే ప్రతీ అడుగు చెబుతుంది..
ఏది ప్రణయమో..ఏది ప్రళయమో..
స్పందించే హృదయం చెబుతుంది..
ఏది గమనమో..ఏది గమ్యమో..
మార్గాన్ని ఎన్నుకునే విధానం చెబుతుంది..
ఏది పెళ్ళో ..ఏది దాంపత్యమో..
అర్ధంచేసుకున్న అన్యోన్యత చెబుతుంది..
ఏది జీవనమో..ఏది జీవితమో..
నడిపించే కాలమే చెబుతుంది..
కారు చీకటి నిండిన మదిలో వెలుగు రేఖల సందేశంకై అన్వేషిస్తున్న ఈ నిమిషం..ఏం చెబుతుందో వేవేల వన్నెలతో వేచి చూస్తున్న ఈ క్షణం..

