చౌక బారు మనిషి
చౌక బారు మనిషి
ఎంత గౌరవించానో తెలుసా ప్రియా
నీ భావాల్ని ఎంత ఇష్టపడ్డానో తెలుసా
ఏంటీ
ఎవరైనా ఎంత ప్రేమించానో అని అంటారు
వీడేంటీ
ఎంత గౌరవించానో అంటున్నాడు అనుకుంటున్నావా
ఒక్క సారి నువ్వు చుట్టూ ఉన్న మనుషుల్ని చూడు
ఎంత మంది నిజంగా వాళ్ళు ప్రేమించే వాళ్ళని గౌరవిస్తున్నారు
ఎంత మంది వాళ్ళు ప్రేమించే వ్యక్తి యొక్క భావాల్ని అభిప్రాయాల్ని ఇష్టపడుతున్నారు
ప్రేమంటే కేవలం నాలుగు గోడల మధ్య ఒకరి శరీరాన్ని మరొక శరీరంతో
రాపిడి చేసుకొని కొన్ని క్షణాలు కలిసి గడపడం మాత్రమే కాదు
ప్రేమించిన వ్యక్తిని గౌరవించగలగాలి
వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి
మనిషిగా మరింత ఎదిగే అవకాశం ఇవ్వగలగాలి
అలా లేనప్పుడు
ప్రేమించి ఆరాధించేవారిని చిన్న చూపు చూసి అవమానించినప్పుడు
వారి ప్రేమ చూపులు లోకానికి పిచ్చి చూపులుగా కనిపిస్తాయి
వారికి నలుగురిలో తలెత్తుకుని బ్రతికే అవకాశాన్ని దూరం చేస్తాయి
నిజాయితీగా ప్రేమించేవారిని చౌకబారు మనిషిలా చేస్తాయి