STORYMIRROR

Keerthi purnima

Classics Fantasy Inspirational

4  

Keerthi purnima

Classics Fantasy Inspirational

బతుకమ్మ

బతుకమ్మ

1 min
349

ఎన్నో ఏళ్ల చరిత్ర కలది నా బతుకమ్మ పండుగ

ఎన్నో త్యాగాల జ్ఞాపకం నా పూల పండుగ


ఊరంతా ఏకం అయ్యే అధ్బుతమైన పండుగ

రంగురంగుల పూలు అందంగా కూర్చిన అందమయిన పండుగ

పట్టు పరికిణీలు బతుకమ్మ చుట్టూ ఆటలాడే పండుగ

ఎదురుపడిన అందరినీ పలకరించే పండుగ

కాలి మువ్వల సవ్వడులు గల్లుగల్లున మోగే పండుగ

పసుపు ముద్ద తో అమ్మని కొలిచే అమ్మోరు పండుగ

గౌరమ్మను చేసి బతుకమ్మ మీద పూల పందిరేసే పండుగ

మిణుగురు లాంటి వెలుగు జిగుళ్ళల్లో దగ దగ మెరిసే అందాల పూలవనం లాంటి పండుగ

అమావాస్య నాడు నిండు పున్నమిల కాంతులు వెరిసేటి క్షణనా ఆశ్చర్య పోయేటి పండుగ

మా మదిలో మెదిలే మధుర గానం నీవే నిండుగా

మమ్మల్ని చల్లగా చూసి దీవెనలను ఇవ్వమ్మ గౌరమ్మ అండగా


ఎన్నో ఏళ్ల చరిత్ర కలది నా బతుకమ్మ పండుగ

ఎన్నో త్యాగాల జ్ఞాపకం నా పూల పండుగ


Rate this content
Log in

Similar telugu poem from Classics