STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

4  

Midhun babu

Abstract Classics Others

బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ ఉయ్యాలో

1 min
218

“ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో”


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ సూడమ్మ

ఉయ్యాలో


తెలగాణ మంతటా ఉయ్యాలో ప్రాంతీయ పండుగా  ఉయ్యాలో

ఆడపడుచు లందరికి ఉయ్యాలో నవరాత్రు లందునా

ఉయ్యాలో

అతి పెద్ద పండుగా ఉయ్యాలో రోజుకొక్క పేరునా ఉయ్యాలో

ఎంగిలి పూల బతుకమ్మతో షురువై ఉయ్యాలో

సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఉయ్యాలో

గత పదేళ్ళుగా ఉయ్యాలో విదేశాలకు కూడ పాకింది ఉయ్యాలో

సంజె వేళల యందు ఉయ్యాలో ఆట పాటల తోటి ఉయ్యాలో

అందరూ సల్లంగ సూడంగ ఉయ్యాలో బతుకమ్మ పేరునా గౌరమ్మ నుయ్యాలో

 తంగేడు చామంతి బంతి పూలతో ఉయ్యాలో

 రంగు రంగుల గునుగు పూలతో ఉయ్యాలో

 అంద మొలికే టట్టు ఉయ్యాలో కనులు కుట్టేటట్టు

 ఉయ్యాలో

 పేర్చి కూచుండ బెట్టుదు రుయ్యాలో వాడ వాడ

 లందు ఉయ్యాలో

 గ్రామాలు నగరాలు ఉయ్యాలో బొడ్డెమ్మ పాటలతొ

 ఉయ్యాలో

 మారు మ్రోగుట చూడ ఉయ్యాలో మది పొంగి 

 పోవునూ ఉయ్యాలో

 పరికిణీ లంగాలో ఉయ్యాలో చప్పట్ల ముచ్చట్లు

 ఉయ్యాలో

 అన్ని వయసుల వారు ఉయ్యాలో ఆడంగ పాడంగ 

 ఉయ్యాలో

 జాతి మత కులాల కతీతంగ ఉయ్యాలో జరుపు

 కొందురీ పండుగ ఉయ్యాలో

 తెలగాణ సంస్కృతికి ఉయ్యాలో అద్దమై వెలుగంగ 

 ఉయ్యాలో


 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ సూడమ్మ

 ఉయ్యాలో


 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సల్లంగ సూడమ్మ

 ఉయ్యాలో...


Rate this content
Log in

Similar telugu poem from Abstract