బ్రతుకు
బ్రతుకు
గతంలోనిచేదుస్మృతితలుచుటేల పదేపదే
గతితప్పినజీవితమనివగచుటేపదేపదే
శృతిమించిన తీరుసాగి చతికిలబడి వగచకెపుడు
శృతేలేని బ్రతుకు పాట పాడనేల
పదేపదే
ఊహల్లో విహరించిన అనుభూతులు కలుగునెట్లు
ఊరువాడ వదిలిపోతు వగచు టేల
పదేపదే.
రేయిపగలు తిరిగిచూడ సుఖముజాడ కానరాదు
నేడుకాదు రేపనంటు వెదుకుటేల
పదేపదే
సద్దుకుంటుఒద్దికైననడతనేర్చిచను జానకి
సుఖశాంతుని శుభవేళని వదులుటేల
పదేపదే

