బంధం
బంధం
కొన్ని బంధాలు అంతే
ఇక వొద్దులే మనకి సరి పడవులే...
అనుకొన్న అంతే ప్రేమ తో సుగంధాలు ఇస్తాయి...
పొరపాటున మరపు చేద్దాం అంటే
మది మాట వినదు...
గత జ్ఞాపకాలు భవిష్యత్ లో కొత్త గా.. మరొక్కసారి సరి చేసి శృతి కలపమని... తనకై అక్షర సుమాలతో మరిన్ని భావాలు పలికించమంటూ... 🙏🏻ఎన్ని తీరులో.. కదా ఈ మది భావనలు దాని స్పందన తో సంబంధం లేకుండా... అహలతో.. ప్రేమను.. ఆరాధనను... మదిలోనే దాచేస్తూ.. మనం.. ఉన్నతం గా..
ఎంత వరకు ఇది... ఔచిత్యం.. ఓ సారి అలోచించి... ఆ బంధాలు అనురాగలై రాగాలు తీసేలా చేద్దాం....

