STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

బంధాలు

బంధాలు

1 min
239

ఎన్ని గింజలు వేసినా

ఎంత ప్రేమ కురిపించినా

పంజరంలోని చిలుక

నవ్వమంటే నవ్వుతుందా..

పిట్ట గోడ మీద

పిడికెడు గింజలు పెట్టి

గుక్కెడు నీరు పోసి చూడు

ప్రకృతి లోని చిలుక

తన రెక్కల సవ్వడి లో

సంగీతం వినిపిస్తుంది..

విరుల తోటలోని కసిమొగ్గలను

కసిగా చిదిమేయక వదిలి చూడు

తన పరిమళాలనద్దిన

వాసంతాన్ని నీకందిస్తుంది..

బంధాలు అనుబంధాలు కూడా

వదిలేస్తే విడిపోయేవి కావు

బంధిస్తే కలిసేవి కావు

అవి అంతే అపురూపమైనవి..

అలా..అలలా...సాగుతాయంతే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy