STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

బహూ మధురం

బహూ మధురం

1 min
5


నీ తియ్యని కన్నులలో ఎదురుచూపు.. బహు మధురం..!

అందాలకు అందమైన ఏకాంతము.. బహు మధురం..!


సొగసుపడవ చూసుకుని మురిసిపోవు టద్భుతమే..!

నిన్ను చూచు గుండెలయల..సంగీతము..బహు మధురం..!


నీ చక్కని భావాలకు రూపశిల్పి ఎవరోయీ..?!

ప్రశాంతమౌ నీ మోమున..దరహాసము..బహు మధురం..!


అపురూపత సొంతమైన సోయగాల వారాశీ..!

చిత్రముగా జగములేలు సౌందర్యము..బహు మధురం..!


పలకరించి పరిమళించు పూలతోట జీవితమే..!

తెలియజేయ సాక్షియైన నీ మౌనము..బహు మధురం..!



ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Romance