STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

భరించలేని బాధ

భరించలేని బాధ

1 min
363

శీర్షిక: భరించలేని బాధ

*********************


ఉత్కృష్టమైన అమ్మ పిలుపుకై

నవమాసాలు నవ్వుతూనే మోస్తూ

భరించలేని బాధ ను భరిస్తూ

ఓపలేని కష్టం ను దిగమింగుతూ

వేవిళ్ళకు వచ్చిన వాంతులతో

అన్నంముద్దను అతికష్టం మీద మింగుతూ

బిడ్డ కదలికలకు మురిసి పోతూ

నెలనెలా సాగుతున్న పొట్టను

సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ

రూపాంతరం చెందుతున్న బిడ్డనీ స్పృశిస్తూ

మాతృమూర్తిగా మారుతున్న 

శుభ తరుణం ను ఆస్వాదిస్తూ 

పురిటి నొప్పి పునర్జన్మ ని తెలిసినా

మాతృత్వ మాధుర్యానికై

తన త్యాగాల ప్రస్థానం ప్రారంభిస్తుంది

మాతృదేవోభవ కు నిజరూపమై మురిపిస్తుంది

సరికొత్త సంతకంతో చరిత్రను పునర్లిఖిస్తుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy