భగవంతుడు
భగవంతుడు


భగవంతుడన్న మాయల మరాఠీ కాడు;
ఇంద్రజాల మహేంద్రజాలాల చేయు ఐంద్రజాలికుడు కాడు;
మనం కోరుకున్న తక్షణమే మాయచేసి మనకి కావలసినవి తెప్పించు బాబా కాడు;
భగవత్తత్త్వం కోరికల తీర్చుట కాదు;
భగవంతుడు కల్పతరువు, కామధేనువుల
అన్నగారు కాడు;
భగవంతుడు జ్ఞాన సంపన్నుడు
కరుణాంతరంగుడు, మనల కాచువాడు
భగవంతుడు గురువు, స్నేహితుడు, బంధువు
భగవంతుడు భావస్వరూపుడు, ప్రజ్ఞాశాలి