STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

భావనా

భావనా

1 min
258

బాష లేని బాస్యం ఒకటి ఉంది చూడలేదా

నీ వెన్నంటూ నా అడుగులు కనపడలేదా

మనస్సు పొరల్లో గూడుకట్టుకున్న మాటేదో

చేరకుంది 


మానససరోవరం మనముందరంది

కుసుమము లెన్నో అలంకరించుకుని

మాటలేవో కరువయ్యాయి

అయినా మనసులు  మాట్లాడుకుంటున్నాయి

సడిలేని శబ్దo వినబడుతుంది

పేరుతో పిలిచావో

మాటగా నిలిచావో తెలియకుంది


నా పెదవులు మాట్లాడుతున్నా భావన ఉంది 

కానీ నీ చెవులకు చేరకుంది  అయినా

సంతసమంతా  మనమధ్య అల్లుకుంది


నీవుతప్ప నా కనులకు ఏమి కానరాదని 

నీ మాట తప్పా నా చెవులకు వినపడదని

అనుకుంటాను కానీ నిన్ను చూస్తే పెదవులకు 

మాట ఉండదు మనసుకు చలనముండదు

చెవులకు వినికిడి ఉండదు


కనురెప్పల చాటున దాగిన నీ రూపమేంతో

అపురూపం కావ్యాలు అలంకరించిన నీఊహ

నాకెంతో ఆరాదనం

  

మనసెరిగిన హృదయం మనకోసం  

ఒక్కటంటే ఒక్కటి కొలువుంటే 

 కలకాలం నిలిచిపోదా మరణమృదంగం  

 మీటు వరకు...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance