Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

భారతనారి

భారతనారి

1 min
3

*భారతనారి*


1.

ఉత్పలమాల.


భారతదేశ నారి బహు ప్రాజ్ఞత తోడ మెలంగుచుండి తాన్

దీరిచి దిద్దు బిడ్డలను ధీరులుగా చరియించి వర్థిలన్

వేరము జూపకన్ గనును పెద్దల నాదర మొప్పగన్ సదా

భారము మోయుచుండి తన బాధ్యత లన్నియు సల్పు నోర్పుగన్ /


2.

ధ్రువకోకిల.


మమత నింపి గృహంబు వెల్గగ మాత నిల్చును దేవతై

నిముసమైన విశ్రాంతి కోరక నిష్ఠగా శ్రమ కోర్చుచున్

ప్రమద సల్పును కార్యముల్ తని వారగా ముదమొందుచున్

క్షమను కల్గిన కాంత చిత్తము సాంత్వనంబిడు భర్తకన్ /


3.

చంపకమాల.


చదువులు నేర్చి చానెపుడు చక్కగ వృత్తులు నిర్వహించుచున్

బదవులు పొంది దేశమున భాగ్యపు సంపద లుప్పతిల్ల స

త్పథమున సాగుచుండి మన సంస్కృతి నెల్లెడ వ్యాప్తిచేయుచున్

సదమలమౌ మదిన్ సతము జాతికి జూపును మంచిమార్గమున్./


4.

ఉత్పలమాల.


కూళలు దుష్టులై కుసుమ కోమలి ప్రాణము దీయుచుండు నీ

కాలము నందు రక్షణకు గ్రక్కున నేర్చుచు యుద్ధవిద్యలన్

బాలన జేయుచున్ మహిళ భారతదేశపు కీర్తినిల్పగన్

స్త్రీలను గౌరవించుటయె శ్రేయమటంచు దలంతురీ ప్రజల్.//



Rate this content
Log in

Similar telugu poem from Inspirational