STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

భీష్మ

భీష్మ

1 min
2

భీష్మచరిత.

(తేటగీతి మాలిక )


జహ్ను సంభవ బుత్రుడౌ శాంతమూర్తి 

సత్య ధర్మాలఁ జేపట్టి శాంతనవుడు

రక్షకుండాయ కౌరవరాజ్యమునకు

నీతి తప్పిన పౌత్రుల నీడఁ బ్రతికి 

తప్పు దిద్ధంగ యత్నించె ధర్మపరుడు.


ఓటమెరుగని వీరుడై యుద్ధమందు

చేవ చూపె నాకలిగొన్న సింహము వలె.

నాయుధంబును పట్టని యచ్యుతుడట

సంహరింపంగ దూకెనా సమయమందు

తెలుప తరమౌన భీష్ముని ధీరగుణము!

కరము మోడ్చుచు కృష్ణుని కనుల గాంచి

మా విజయుని మిత్రుండని మమత జూపె.

'తాత!నిన్నెట్లు చంపుట! దారి చూపు!'

మనుచు వేడు యుధిష్ఠిరు కభయ మిడుచు

మరణ రహస్యమున్ తెలిపిన మంచి తాత!

బాణ శయ్యపైన పరుండి బాధనొదిలి

రాజ ధర్మముల్ బోధించె రాజు కపుడు.

విష్ణువున్ బొగడి తరించె వేలమార్లు

మాఘ శుద్ధయేకాదశిన్ మరణమొంది

ముక్తినొందెనా కురువృద్ధ పుణ్యమూర్తి.

అర్ఘ్య మిడుచుండి భీష్ముని కంజలించి

తలచు కొన్నచో మోక్షంబు గలుగు మనకు.//


Rate this content
Log in

Similar telugu poem from Classics