STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

శివరాత్రి

శివరాత్రి

1 min
5

శివరాత్రి దినమున శుచినై మేల్కొంటిని 

దివసము రాత్రి యుపవాసముంటిని 

శివ శివ! మహాదేవ శంభో!శివ శంభో!

స్తవముల గొల్తును సాకుము శంభో!

శివా!యని నీ నామమునే పల్కితి

భవహర!నీ దివ్య సన్నిధికి జేరితి

మూలేశ్వర!నీపై నా భక్తిని చాటితి

భోళా శంకర!సంరక్తిగ నీకు మ్రొక్కితి

నిరంతరమ్ము ధ్యానింతు నో దేవరా!

కరంబు వీడక నన్ను బ్రోవు మీశ్వరా!

తరుణేందుశేఖరా!దయజూపరావా!

దరిసెనమీయరా!తామసహరా!దేవా!

అభిషేకము చేసెద నభయమొసంగుమా!

అభిమానము జూపుచు నన్నాదరించుమా!

నెఱనమ్మితి నీ పాదయుగ్మములనో దేవా!

మరుజన్మంబు లేని వరమీయంగ వేగరావా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics