STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

కాశీశ!బ్రోవుమా!

కాశీశ!బ్రోవుమా!

1 min
1

కాశీశ!బ్రోవుమా!

(ఇష్టపదులు )


నీమముగ సేవలను నిష్టగా సల్పెదను 

కాముని వైరీ !నా కష్టాలు తీర్చుమా!


మదియందు నిల్పితిని మదనారి!మమ్మేలు!

వదిలించి మూఢతను పాపంబు కాల్చుమా!


జీవంబు నీవంచు చిత్తమున దల్చెదను

కావంగ రావయ్య! కాశీశ!బ్రోవుమా!


కరుణతో కాలాత్మ!కర్మలను ద్రెంచుమయ!

తరియించు మార్గమును దయతోడ జూపుమా!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics