STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

భానోదయం

భానోదయం

1 min
7

భానోదయం 


(కవిత )


మత్తులో మున్గిన నా మనసు నిదుర లేచింది 

చెత్తయాలోచనల చిమ్మ చీకటిని తొలగించింది 


బుద్ధిలో వికాసమిప్పుడే పొడసూపసాగింది 

బద్ధకపు పిశాచమదిగో భయంతో పాఱింది 


హృదయాన యూహ తా నెఱుకతో నవ్వింది 

బదులుగా గొంతులో పాటొకటి పుట్టుకొచ్చింది 


మందహాస మిదిగో మైమరపును తెచ్చింది 

సుందరమౌ ప్రకృతి నన్ను చోద్యంగా చూసింది 


ప్రక్కమీదనుండి లేవగా వాకిలి విస్తుపోయింది 

చక్కనైన భానోదయాన నను చల్లగాలి నిమిరింది.


ప్రొద్దుప్రొద్దున్నే విరితోట మురిపాలు చిలికింది 

సద్దుచేస్తూ పులుగుతతి స్వాగతము పలికింది 


హాయిగా నిలుచుండి నే నానందమొందితిని 

చేయిని చాపుచు ప్రకృతితో చెలిమిని కోరితిని.


 'చెట్టుపుట్టలను పెంచి జీవులను రక్షించు!

పట్టుదలతో నీవు ప్రాణవాయువును పెంచు!


జలసంరక్షణను నీవు జాగ్రత్తగా సలుపుమా!

చెలిమి చేసెద నేను చింతలేదని తలచుమా!'


ప్రకృతి మాటలను వినుచు పరవశించితిని 

సుకృతమని తలచి చిన్నమొక్కనాటితిని.



Rate this content
Log in

Similar telugu poem from Classics