STORYMIRROR

Midhun babu

Classics Fantasy Children

3  

Midhun babu

Classics Fantasy Children

బడిగంటలు

బడిగంటలు

1 min
6


గుండెతడిని కాపాడిన..జ్ఞాపకాలు బడిగంటలు..!

మరువతగని శిక్షణకే..ఆలయాలు బడిగంటలు..! 


పవిత్రమౌ స్నేహానికి..ఊపిరెలా నిండిందో.. 

నెమలీకల పంపకాల..తవ్వకాలు బడిగంటలు..! 


పద్యమైన పాఠమైన..బట్టీయం పెట్టించెను.. 

శ్రద్ధాసక్తులు పెంచిన..కలరవాలు బడిగంటలు..! 


ఓనమాల కలలపంట..పెద్ద బాలశిక్ష సాక్షి.. 

మట్టిపలక బలపాలకు..విన్నపాలు బడిగంటలు..! 


తాటియాకు పాకలలో..గున్నమావి నీడలలో.. 

కాగితాల పడవలలో..వానపాలు బడిగంటలు..! 




Rate this content
Log in

Similar telugu poem from Classics