బాటసారి...
బాటసారి...
బాటసారి నా చేతుల్లో ఉందొక
చందమామ వస్తావా నీకిస్తాను
నా చిరకాంక్షిత స్వప్నాలు
చిర సంచిత ఆశయాలు
పంచుతాను
నీతో కలిసి ఒక కొత్త బతుకు మొదటి పేజీ
తెరుస్తాను
బహుదూరపు బాటసారిని
నా వెంట తీసుకెళ్తాను
వస్తావా
ఈ రాత్రి నదిని మనం దాటాలి
ఈ శిశిరం మ్రుత్యువై కబళించకుండా
చూసుకోవాలి
మనిద్దరం రెండు పులులై నడుద్దాం రా
నాదైన ఒక లోకం నాలో వెలుగుతూ ఉంది
అవకాశాల స్వర్గం దాక్కొని ఉంది
దారి చూపిస్తాను రా
నీ రెక్కలతో నువ్వెగిరేందుకు మహా సౌందర్య నీలాకాశం
నీ ఆశయాలతో నువ్వు విహరించేందుకు ప్రణయహిత
ప్రాణహిత
స్వేచ్చా వాయు మండలం
నాలో పెల్లుబుకుతున్న అభూతపూర్వ శబ్ధాలు
విన్నూత్న విస్మయ వాక్య సమూహాలు
మౌన మ్రుత నిర్ణిద్రా ప్రపంచాలు
ప్రజ్వలిత అపరివ్యాప్త హాహా కారాలు
అమరత్వాలు మోహావేశాలు ప్రియ మ్రుదు సరళ సౌమ్య భాషణలు
నాలో అతలాలు సమతలాలు
చలనాలు అచలనాలు
చుంభితాలు అచుంభితాలు
వాంచితాలు అవాంచితాలు
నాలో ఆగకుండా కురుస్తున్న వర్షాలు
ముసురుతున్న మేఘాలు
దూకుతున్న జలపాతాలు
సంచరిస్తున్న వన్య మ్రుగాలు కదులుతున్న సర్పాలు
అల్లుకుంటున్న లతలు
నా ప్రేమలు కౌగిళ్ళు స్ప్రుహలు పులకరింతలు
నాలో చిగురిస్తున్న తరుశాఖలు
నేను స్పర్శిస్తే మారిపోయే ఆర్ద్ర ద్రుశ్యాలు
నేనొక్కణ్ణే వేల వేల జనంగా మహా సైన్యంగా
అస్త్రంగా శస్త్రంగా శాస్త్రంగా
అవతరిస్తున్న మహా తరుణం మహా ఘడియ
అమ్రుత వేళ
నా విశ్వాకారం
విశ్వరూపం
సూక్ష్మ రూపం
సులభ రూపం
చూస్తావు నాతో రా
... సిరి ✍️

