బాల్యం
బాల్యం


నా బాల్యాన్ని వెతుక్కున్నా
ఏటి ఒడ్డున పిల్లలు ఆడుతున్నా
ఇసుకలో గూళ్ళు కడుతున్నా
కోతి కొమ్మచ్చి ఆట లాడుతున్నా
వారిలో నేను లేను ఎక్కడా
నా గురుతులు లేవు అక్కడా
అమ్మా నాన్న ల దగ్గర కూడా
వెతికాను నన్ను అక్కడక్కడా
అందరితో ఆటలెన్నో ఆడాలని ఆశ
అమ్మా నాన్న లతో ఉండాలని ఆశ
ఆడే వారిలో ఉంటానని చిన్ని ఆశ
బడిలో అమ్మఒడిలో ఎదగాలని ఆశ
ఆశలన్నీ అడియాసలు కాగా
అనాధాశ్రమం అమ్మ ఒడి గా
భిక్షాటనమే మొదటి బడిగా
గాలికి ధూళికి అలాగే ఎదిగా
బాల్యం నాది కాదు మధురం
తలపుకు వచ్చిన బాధాకరం
స్మృతి మాత్రానికే కఠినతరం
ఎవరి బాల్యం కారాదు కర్కశతరం
ఏనాడు చేసిన పుణ్యమో
ఎన్నడు చేసిన దానఫలమో
విధాత లలాట లిఖితమో
నన్ను చేరదీసిన వారి ధర్మమో
మహాత్ములు చక్కగా చదివించారు
పంతుళ్లు నాపై జాలి తలచారు
మంచి స్నేహితులు జత కట్టారు
విద్యాధికునిగా నన్ను మలిచారు
నేనిప్పుడు మంచి జీతగాడిని
సంఘం లో పేరున్న వాడిని
చక్కని కుటుంబం కలవాడిని
అందరి మేలు కోరే వాడిని
నా ఉన్న త స్థితి కి కారకులు
నను కన్న తల్లి దండ్రులు కారు
ఆనాథ ముద్ర వేసిన ఆశ్రమం కాదు
నను చేరదీసిన వారు కారకులు
ఎన్నటికీ మరువరాని వారు
దైవమిచ్చిన అమ్మా నాన్న లు
వారువురి పాద సేవా భాగ్యం
నా పాలిట మహద్భాగ్యం