అవ్వా, తాతా అనే పిలుపులేడనే
అవ్వా, తాతా అనే పిలుపులేడనే


పండగొచ్చె
బస్సు టైర్లు ఆగిన చప్పుడు
గాలికి దుమ్ము లేసె
దిగినోళ్లు మల్లా ఎల్లిపోయిరి
చాటలు పరకలు
మట్టి కుండలు
ఓ అరుగు మీదకి చేరి ముసలి పానాలు
సదువనో
సోకనో
బతుకు తెరువనో
బాగుందనో
పట్నం పోయిన పిల్లలు
సానా కాలం నుంచి కనిపించని పిల్లల పిల్లలు
టీవీలో ఏదో సెప్తే
కళ్ళల్లో నీళ్ళు తిరిగి
మల్లా ఛానెల్ మార్చే ఓళ్ళలో
తనని సూసేందుకు వచ్చేది ఎవురు
దిబ్బలు
దిబ్బల్లో గీరుకునే కోళ్లు
మేత మేసే గొడ్లు
ఎదురుచూస్తున్న కళ్ళల్లో నీళ్ళు
పల్లె అట్లనే ఉంది
అంతా ఖాళీగా ఉంది
అవ్వా, తాతా అని పిలుపులు వినబడక
సచ్చుగా ఉంది