STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

3  

Gayatri Tokachichu

Inspirational

అవినీతి

అవినీతి

1 min
148

*అవినీతి*

(బాలపంచపదులు )


అవినీతి దేశమునావరించంగ

చవటలై పాలకులు సర్దుకోగ

జనులెప్డు కష్టాలు పడుచుండగ

దేశప్రగతి దిగజారుచుండగ

మేలు జరుగునా మనకు విజయా?


నల్లధనమును పెంచెడి ఘనులు

దేశాన్ని తినెడి చీడపురుగులు

ఉదాసీనంగా ఉండగా నీ జనులు

ఊడ్చేస్తారు సంపదనీ దుర్మార్గులు

నిదురమేలుకో!త్వరగా విజయా!


దురితగుణముతో చెల్గు హీనులు

జాతిని పీడించెడి దేశద్రోహులు

చీకటి బజారులోని సరుకులు

కొనబోకండి వినియోగదారులు!

వ్యవస్థనెదిరించాలమ్మా!విజయా!


అక్రమముగా కూడబెట్టి ధనము

మేడలెన్నియో కట్టుట నీచత్వము

పేదసాదలకేది భవితవ్యము?

జాతిని కాపాడుకోవాలి మనము!

కరము బిగించి కదులు విజయా!//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational