అతని కోసమే
అతని కోసమే
చుట్టూ వున్న వర్ణాలన్నీ నావే
పువ్వు ల్లో నేనే
పికములతో నేనే
నను దూరంగా విసిరేస్తే సుమాల్లోనే పడతాను
నాతో మౌనమైతే పక్షులతో మమేకమవుతాను
చలనం లేని చూపులను కొలిచే కన్నా కొలనులో మీనముల ఉత్సాహాన్ని నాదిగా చేసుకుంటాను
మౌన లిపిని అనువదించేకన్నా
పరివ్యాప్తమైన ప్రేమానుభూతిని ఒడిసి పట్టి
నాలో ఒంపుకుంటాను.
నేను ఒంటరిని కాదు
నేను విశ్వ వ్యాప్తిని
నా ప్రేమ అనంతం
నా అనుభూతి సజీవం
నా ఎదురు చూపున విరిసే కుసుమపరిమళం
అతని కోసమే....

