అతివంటే
అతివంటే


‘కరాగ్రే వస తే లక్ష్మి ..’ అంటూ లేవగానే
శక్తి స్వరూపినులను కీర్తించినా
‘యాత్ర నార్యంతు పూజ్యతే...’ అంటూ
మహిళల ఔన్నత్యాన్ని మననం చేసినా
‘మాతృదేవో భవ.........’ అంటూ
ప్రధమ స్థానమిచ్చి గౌరవించినా
‘నారీమణి,భార్యామణి ...’ అంటూ ఆమె కోసం
అత్యున్నతమైన మణి ని మకుటంగా చేర్చినా
‘కార్యేశుదాసి... కరణేషు మంత్రి...’ అంటూ
అష్టావధానాలు అవలీలగా చేయగలవంటూ ఆకాశానికేత్తేసినా
మహిళను అత్యున్నత స్థానం లోనే ఉంచారు అలనాడు
నేడు కాల్ సెంటర్లలో కామంగా చూస్తూ
కనికరం లేక కాంతను కనకం చేసి
కన్యాశుల్కమైనా, వరకట్నమైనా
కష్టపడేది,నష్టపోయేది కన్యనే అయితే
వన్నె తగ్గని వనితను వాణిజ్య విఫణిలో
వల్గర్ గా, వాంప్ లుగా దిగజార్చారు
అతివంటే అపరకా ళికని
కాంత అంటే కనకదుర్గ అని
నిప్పుతో చేలగాట మాడితే
నిలువునా మాడి పోతారని
తెలుసుకోండి ..తెలియజెప్పండి