అసమానమైన స్త్రీ తత్వం (రెండో భాగం)
అసమానమైన స్త్రీ తత్వం (రెండో భాగం)
దగ్గరకొచ్చిన తనకెంపారు నేత్రాలలో కోటి సూర్యోదయాల్ని
ఒక్కసారిగా దర్శించానుమకరికల లేపనం దేహానికి పట్టించిందేమో
మంత్రించినట్లుగా నాసికనదరగొడుతూ గుప్పున తాకే గంధపు, కస్తూరి పరిమళములు సమ్మోహించు తన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుతన శరీర
సౌష్టవం ముందు పండువెన్నెల సైతం వెలవెలబోయింది..!!
తన పెదవుల మధ్య నేనొక పిల్లనగ్రోవిలా తమకముతో ఊయలలూగుతున్నాను
బేడిస చేప వంటి తన విభ్రమ నేత్రాల వీక్షణం లాగి విడిచిన బాణమై సూటిగా గుండెను తాకుతోంది లేతాకు మీది వర్షపు చినుకులా, కొమ్మనుంచి సున్నితంగా వ్రేలాడే పిందెలా నడుస్తూ, నాట్యమాడే మయూరి విప్పిన వేయికళ్ళ వసంతోద్యానవనంలా తనని చూసిన నా కళ్ళు మంత్రించి పోయాయి..!!
వాక్కులకూ ఊహలకు చిక్కదని విధిలేక ఒప్పుకుంటాయి విశ్వసాహిత్యాలు
రంగులకూ, రాగాలకూ అందదనిలోకంలోని కళలన్నీ పూ దండలై తన కంఠమును అలంకరిస్తాయి ఇంతకన్నా తన గురించి ఇంకేం చెప్పాలి కళలన్నీ రంగురంగుల బావుటాలైసాహిత్యాలన్నీ సరస కావ్య సౌరభాలైసౌందర్యాలన్నీ మహోజ్జ్వల దీప మాలికలైఆనందాలన్నీ విశ్వ స్వాగత తోరణాలైకందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ చతుర్ధావస్థతో ప్రతిధ్వనులు గావిస్తున్నాయి.. !!
నిశ్శబ్దంలో ఆరిపోయిన వేవేల గొంతుకలు సైతం క్షణకాల తన సమ్మోహన వీక్షణముతో వసంత కోయిలలై సప్తగమకములు పలకగలవు... !!
ఇదే తన లక్షణం.. విలక్షణం..!!!

