" అప్పుచేసిన విద్యార్థి "
" అప్పుచేసిన విద్యార్థి "
" అప్పుచేసిన విద్యార్థి " - రాజేష్ ఖన్నా
=======================
ఏ బంధముందని నన్ను అక్కునా చేర్చుకొన్నారు
ఏ ఋణముందని మీ విద్యాపుత్రుడిగా మార్చుకొన్నారు
ఏ బాధ్యతుందని ఈ సమాజం ముందు నిలబెట్టారు
మీరు నన్ను కన్నవారు కాదు కదా,
మరీ నన్నింతలా ప్రేమించినా బంధానికి పేరేమిటి?
మీరు లేకపోయుంటే నాకు ప్రాణం మాత్రమే ఉండేది
మీరే ఆ ప్రాణానికి విలువతెచ్చే మంచి జీవితాన్నిచ్చారు
ఆ జీవితంలో వెలుగులు నింపే విజ్ఞానాన్నిచ్చారు
ఆ విజ్ఞానాన్నీ కాపాడుకొనే లోకాజ్ఞానాన్నిచ్చారు
ఆ లోకజ్ఞానంతో నేనేర్పర్చుకోవాల్సిన పరిధిని చూపించారు...
మీరు నా వెంటపడి, నా కంటతడికి చలించారు
నన్ను మనిషిగా మార్చడానికి ఎంతో శ్రమించారు
నా అల్లరిని భరించారు, నా వెఱ్ఱితనాన్ని సహించారు
నేను మారలేదని, నన్ను మార్చేవరకు మీరూ మారలేదు
మీ ప్రేమని పొరపాటుగా నేను నరకమనుకొన్నాను,
కానిప్పుడదే నాకు వరమై జీవితమయ్యింది.
మీరు మాట్లాడిన ప్రతీమాట నాకు పాఠమయ్యింది
మీ మొక్కవోని పట్టుదల నాకు గుణపాఠమయ్యింది
మీ ప్రవచనం నాకు జీవితపాఠమయ్యింది
మీ కళ్ళల్లో, మీరు కన్నకలల్లో నేనే ఉన్నాను
మీ ఆశయాల్లో, ఆశల్లోనూ నేనే ఉన్నాను
మీ ఆవేదనల్లో, ఆలోచనల్లో నేనే ఉన్నాను
నా తడబాటులో మీ తపన తల్లడిళ్లింది
నా ఓటమిలో మీ రోదన మిన్నంటింది
నా గెలుపులో మీ హృదయం ఉప్పొంగింది
మీ మనసుకి తట్టినా భావాలన్నీ నావే
నాకోసం మీ సవాళ్లతో పోరాడారు
నాకోసం మీ బలహీనతల్ని దాటుకొనొచ్చారు
నాకు వినపడేలా మీ ఒంట్లో శక్తినంతా కూడగట్టుకొని
నీరసాన్ని దాటుకొని మరీ పాఠం చెప్పారు
నా ప్రగతే మీరు సంపాదించినా ఆస్థనుకొన్నారు
ఇంతలా నాకోసం కస్టపడినా మీకు నేనేమివ్వగలను
నేను వినకపోతే మీ స్వరం పెంచారు తప్పితే
నన్ను దండించే ధైర్యం చేయలేకపోయారు
గురువులు తన విద్యార్థిని ఇంతలా ప్రేమిస్తారనీ
ఒక జీవితాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లగలరని
గురువుకున్న గొప్పతనాన్ని దరువేసి మరీచెప్పారు భారమైనా చదువుని అవలీలగా నేర్పించారు
బంధాలవిలువలు బాధ్యతగా వివరించారు
బడిపంతుళ్ళంటే బలాదూర్లు కానేకాదని
బ్రతుకుబాటలేసే ఆత్మబంధువులని నిరూపించారు
ఇంత చేసిన మీకు నేను తిరిగేమివ్వగలను?.
నా అవివేకమేంటో తెలిసిన మీకు
నేను వివేకినని గర్వంగా చెప్పుకోలేను
నేను సంపాదించిందాంట్లో ఎంతమందికి
దానధర్మాలు చేసినా మీ విషయంలో మాత్రం
ఎప్పటికీ అప్పుచేసిన విద్యార్థిగానే మిగిలి ఉంటాను
మీరిచ్చిన విద్యా, విలువలు, జీవితం, ప్రేమల్ని
నేనెప్పటికీ తిరిగివ్వలేని ఋణగ్రస్తుడిగానే ఉంటాను
ఆ ఋణం తీర్చాలన్నా భయమే
నేటి గురువుతో మాట్లాడాలన్నా భయమే
సద్గురువు మీ తరంతో
నే సంసిపోయాడు
మనిషితో పాటు గురువు సైతం మారిపోయాడు
విద్యార్థుల్ని ప్రేమించడం మర్చిపోయాడు
విద్యార్థులు సైతమతన్ని ప్రేమించడం మానేశారు
విద్యా ఒక వ్యాపారమయ్యింది
నేటి గురువు హాస్యానికి ఓ ఆటవస్తువయ్యాడు
సోమరిగా, స్వోత్కర్షజీవిగా మారిపోయాడని
నకిలీ మనిషిగా నటించడం మొదలుపెట్టాడనీ
నిందించడానికి నినాదించడానికీ అర్హుణ్ణి కాను నేను
గురువుని గౌరవించలేని జీవితం గుడ్డిజీవితం కాదా?
తన ఆదర్శాన్ని మర్చినవ్యక్తి, గురువవ్వగలడా?
పాఠాలు చెప్పడం మానేసి పాలసీ ఏజెంటుగా,
రియల్ ఎస్టేట్ బ్రోకరుగా మారినోడు గురువవ్వగలడా?
గురువంటే ఆదర్శానికి అద్దంలాంటివాడు కదా
భావితరానికి ఆయువుపట్టులాంటివాడు కదా
సింహాసనాన్ని వదిలి బురదలో దొర్లడం
నిజరూపాన్ని వదిలి ముసుగుతో బోర్లడం
సద్భావాన్ని వదిలి మూర్ఖంగా బ్రతకడంలో
సామాన్యుడున్నాడు కానీ, గురువెక్కడున్నాడు?
ప్రపంచాన్ని గొప్పగా మార్చగల్గింది గురువే కానీ
ప్రపంచంతోపాటు తాను మారిపోయాడేందుకు?
ప్రపంచానికి మంచిని పంచి, చెడుని తుంచేసినా
గురువు తన స్థానాన్ని కోల్పోయాడేందుకు?.
గురువులేని విద్యనే కాదు, విశ్వాన్ని దాని రూపాన్ని సహితం ఊహించలేం
గురువు గొప్పవాడని గౌరవించలేని గుడ్డివాళ్ళకి
నిందలేసే హక్కులేదు.
అతని మనసులో దాగున్నా నిగూఢబాధల్ని
అర్థంచేసుకోలేనివాళ్లకి నిలదీసే హక్కులేదు
అతనిలో వచ్చినమార్పుకి అతనే ఆత్మవిమర్శా
చేసుకోవాలి, అతని చరిత్రని తిరగరాసుకోవాలి
నిలకడలేని నిజాయితీ గురువుదగ్గరా సహితం
ఆగలేకపోయింది, అతనిస్థితిని వేగలేకాపోయింది
విద్యార్ధి జీవితం బూటకమనే వేదికమీదా వేసిన నాటకంలో తాటాకుల చప్పుడికే తడబడిపోయింది
ఎండుటాకులు ఎగిరిపోయి ఎర్రటెండకు మండిపోయిన
పూరిగుడిసేలా, పురిటినొప్పులకి తాళలేకా
గురువన్నా మాటకి విలువలేకా, వెర్రితనంతో
మనిషిగా మనుగడలేకా వెలవెలాబోయింది
గురువు తెలవారకముందే తేరుకొని,
తనని తాను సంస్కరించుకొని, విద్యార్థిని
విశ్వవిజేతగా మార్చినప్పుడే , ఆ గురువుదగ్గరా
అప్పుచేసిన విద్యార్థిగా మిగుల్తాడు
లేకపోతే తప్పుచేసినవాడిగా జీవితఖైదౌతాడు.
ఈ సమాజం వేసిన ఎత్తుగడలకి కృంగిపోయినా
గురువుని తాను విజేతగా మారి విజయగర్వంతో
తన గురువునామాన్ని ధృడంగా నిలిపి, గెలిపించడమే అప్పుచేసినా విద్యార్థికున్న విధి.
**** సమాప్తం*****