STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనురాగాలెన్నో

అనురాగాలెన్నో

1 min
173

ఇష్టంగా రాసుకుంటున్నాను

మనసుకు తోచిన మాటలను

అదో చక్కని పాటగా మారినా

కమ్మని కవితగా అలరినా సరే

మనసు సంతోషపడిపోతుంది!

కల కాకూడదనే అనుకుంటా

కమ్మనైన నీ చెలిమి అన్నది

కల్పనలో మనసూగిసలాడుతూ

అదే నిజమని భ్రమపడుతోంది!

పొద్దెక్కిన ఆలోచనలు కొన్ని

వెలసిపోయిన కోరికలు కొన్ని

జారిపోతున్న అనురాగాలెన్నో

ప్రశ్నిస్తూ ఉంటాయెందుకంటావ్!


Rate this content
Log in

Similar telugu poem from Romance