అనురాగ గంధార
అనురాగ గంధార
అనురాగ గంధాల..రాశియై వచ్చింది..!
"శుభకృత్తు" హర్షాల..దాయియై వచ్చింది..!
వర్షించు వర్ణాల..చైతన్య తేజమే..
నిజచైత్ర రాగాల..దీప్తియై వచ్చింది..!
కల్యాణ కావ్యాల..లోకాల నేలగా..
ఆరోగ్య భాగ్యాల..రాజ్ఞియై వచ్చింది..!
వాసంత సరసాల..రసాంగి కోకిలయె..
లేమావి వేదాల..మాయియై వచ్చింది..!
చిగురాకు పరువాల..భోగాల కోకిలము..
శ్రీరామ పాదాల..వాణియై వచ్చింది..!
వేధించు మోహాల..చెక్కిళ్ళ నవ్వుల్లొ..
నవరుధిర నాట్యాల..రాణియై వచ్చింది..!

