అనుకున్నాను
అనుకున్నాను
నేను నీ కలల్లోకి రాను అంటుంటే . ,
నీకు కలలు కనే అలవాటు లేదేమో అనుకున్నాను . . .
నీకు నేను నచ్చలేదు అంటే . ,
నీకేదీ అంత త్వరగా నచ్చవనుకున్నాను . . .
నా మీద ఎటువంటి అభిప్రాయం లేదంటే . ,
నా గురించి నీకు ఏమీ తెలియదు కదా అనుకున్నాను . . .
నీకు నేను గుర్తేరాను అంటుంటే . ,
గుర్తుండిపోయేంతలా నేను సాధించింది ఏమీ లేదనుకున్నాను . . .
నేనంటే ఇష్టం లేదంటే . ,
నువ్వే ఇష్టపడేంతగా నాలో ఏమీ లేదనుకున్నాను . . .
నాతో మాట్లాడటం లేదంటే . ,
నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావేమో అనుకున్నాను . . . .
నా రాతలు నీకు అర్ధం కావడం లేదంటే . ,
తప్పు నాలోనే ఉందనుకున్నాను . . .
నీ మనసులోకి నాకు ప్రవేశం లేదంటే . ,
ఇది ప్రస్తుతానికే కదా ఫరవాలేదులే అనుకున్నాను . . .
నా వల్ల నీకు ఇబ్బందిగా ఉంటుంది అంటే . ,
ఏమో అవునేమో నిజమేనేమో అనుకున్నాను . . .
నన్ను ప్రేమించడం లేదంటే . ,
నా ప్రేమ నీకు అర్ధం కాలేదనుకున్నాను . . .
నీ జీవితంలో ప్రేమకి చోటు లేదంటే . ,
అందరు అమ్మాయిలు చెప్పే మాటే కదా అనుకున్నాను . . .
కానీ. . . ,
పేరులోనే రాయి ఉంది . ,
మనసు అలానే ఊంటుందని ఊహించలేకపోయాను . . .
ఎన్ని రోజులైనా . . , ఎన్ని నెలలు గడిచినా . . , ఎన్ని సంవత్సరాలు మారినా . . .
మనసైతే కరుగుతుంది కానీ . , రాయి కరగదని గ్రహించలేకపోయాను . . . గ్రహించలేకపోయాను ...
రాతిని పూజించే దేశంలో . . ,
రాతిని మనిషి ప్రేమించడం తప్పేమీ కాదు . . , తప్పేమీ కాదు ...

