అనుబంధం...
అనుబంధం...
చూపు చూపుకోక అందం...
నీ చూపులలో నా రూపు చూచి...!
మాట మాటకొక మధుర్యం
నీ మాట నాదని తెలిసి....!
స్పర్శ స్పర్శకోక మధురం
నీ స్పర్శలో నాకే జీవమొచ్చేనే...!
అడుగు అడుగుకొక ఆరాటం
నీ అడుగు వెంటే నా అడుగులు వేయాలని ....!
పలుకు పలుకోక సవ్వడి...
నీ పలుకులలో నా పేరు ప్రియంగా పలుకుతుందని....!
మనసైనా ఆలోచనలే మన ఇద్దరిది
ఒకరిపై మరొకరికి ఒరవడి...!
మన ఆనందానికి
మనసే అసలైన పెట్టుబడి...!
నా కనుల వెంబడి నీ కలలు కలబడి
వెంటపడివచ్చే అనుభూతముల కలతపడి ...!
నీ జ్ఞాపకాలలో కట్టుబడిపోయింది
మనసైనా ప్రేమైక బంధం....!
మమతల అనుబంధం
ప్రేమకు అసలైన అందం...!
నా కనులలో నీ రూపాలు
నీ నాయనాలలో నా ప్రతిబింబం నిలిచిపోయింది...!
ఒకరికి ఒకరంటూ
ఒకరిలో మరొకరమంటూ...!!

