అనుభవం
అనుభవం
తీయని అనుభవం..
నా ప్రాణం లో ప్రాణంగా
నా ఊపిరిలో ఊపిరిలా
నన్ను ఆరాధిస్తున్నావని
ఇప్పుడే తెలిసింది ...
నా మది చెందుతుంది పరవశం మాటలకందని మూగ మనోభావం.
నేనే నీ సర్వస్వం అని చెప్పకనే
నీ మనసు పలక ప్రతిబింబించింది
నాపై నీకున్న అత్యంత ఆత్మీయం ...
ఏ జన్మ బంధము ఇలా పెనవేసుకుంది ..
ఎలా తీర్చుకోను నీ రుణం..
అలుపన్నదే ఎరుగని మన సాంగత్యం ...
మరి ఎన్నడూ వీడని అన్యోన్య అనుబంధం..
నీకు నాకు సొంతం
ఈ తీయని ....అనుభవం

