అంతులేని కథ
అంతులేని కథ
పుట్టిన ప్రతి వాడు గిట్టక
తప్పదు ముందో వెనుకో
పోయేలోపు తనవారికి
తరతరాలకు తరగని
ఆస్తులు కూడా పెట్టాలని
తపన అందరికీ ఉంటుంది
సక్రమ మార్గంలో నడిచేది
కొందరైతే అమార్కులు ఇంకొందరు
జీవితాన్నిపరోపకారం కోసం ఉపయోగించేవారు కొందరు ఎవరేమయితే నాకేంటి నా కడుపు నిండితే చాలు అనుకునేవాళ్లే ఎక్కువమంది
మన వెంట ఏమీ రాదని
తెలిసినా తహతహలు
సంపాదనకై మానడు మనిషి
చనిపోయాక శవాన్ని చూసి
అందరూ మంచివాడనే అంటారు దుష్టుడైన దుర్మార్గుడైన ఇది లోకరివాజు.

