అంతర్జాలం అదో ఇంద్రజాలం
అంతర్జాలం అదో ఇంద్రజాలం


అంతా మాయ , ఇది అర్థం కాని మాయ
ఇది అంతర్జాల మాయ, అదో ఇంద్రజాల మాయ
ప్రేమానురాగాల లోగిలిలో కలహాలు రేపే మాయ
ఆకర్షణలువెంట పరిగెడుతూ, బంధాలను
విడివడుతూ, అర్థం లేని మనసుల ఆరాటమే మాయ
ఇది మనుషుల యొక్క మనసులకు పట్టిన మాయ
ఆనందాల కోసమై, అనుబంధాలను చేరిపే మాయ
ఇది అందాల వేటకై, అనురాగాలను మారిచే మాయ
ప్రేమ ముసుగులో ఒకరిని ఒకరు మోసం చేసుకునే మాయ
విజ్ఞాన అన్వేషణలో, విషాన్ని ఎక్కించే మాయ
చదువులకై ఆశించి, వ్యామోహాలు ఆకర్షించేమాయ
కలల్ని, గమ్యాల్ని,మరచి, బానిస గా మార్చే మాయ
సమాజాన్ని మరచి, తెలియని నవ ప్రపంచాన్ని వెతుకుతున్న మాయ
స్నేహితులను చుట్టూ పెట్టుకొని
కొత్త స్నేహసంబంధాలను వెతికే మాయ
స్నేహం అనే పేరుతో స్వార్థలను తీర్చుకునే మాయ