అంజలి
అంజలి
ప౹౹
హృదయమా దరిచేరనీయవా ఆ దరహాసం
మహోదయం కలగనీ చేసి ప్రేమ సహవాసం |2|
చ||
వెన్నెల వెలుగూ ఎదురై పిలిచి ఎదనే కలుపు
ఉన్న ఆశలు ఊహలే పెంచి తలచే ఆ వలపు |2|
కోరికే కొత్తగమొలిచి మదిని ముంచేమత్తులో తామసమేల తను సిద్దమే వలపునే హత్తుకో |ప|
చ||
కలవరింతలేల మనసులో ఎందుకు కలతలు పలవరింతలతో నిలువరించగలేని అలతలు |2|
ఎక్కడో కురిసిన మేఘమే ఇక్కడే చిగుర్చగా
ఎన్నాళ్ళీ ఎదురు చూపులు ఎడదనే చేర్చగా |ప|
చ||
చూపుల్లో కురిసే ఎలమికి అర్పించు అంజలి
మాపుల్లో విరిసే విరహానికి చూపించు జాలి |2|
కనిపించని స్వర్గమే కబురే చేసే ప్రణయానికి
కాసింత తీరిక చేసి ఒప్పించు పరిణయానికి |ప|

