STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

3  

Gayatri Tokachichu

Inspirational

అంగవైకల్యం

అంగవైకల్యం

1 min
135

అంగవైకల్యమొక తీరని శాపం

నిరతము బ్రతుకును గడుపుట భారం

చదువు సంధ్యలు నేర్వని నిస్సహాయత్వం

సంఘర్షణ మయమైనదా దుర్భర జీవితం

వేదనాభరితమైన ప్రయాణమధైర్యవంతం

తోడులేనిదే కదలలేనిదా దౌర్భాగ్యజీవనం

మానసిక వైకల్యమొక మౌనరోదనం

కొట్లాది మందితో కుములుతున్నదీ భారతం

చేరదీసి నేర్పాలి వారికి సద్విద్యా వివేకం

భరోసా కల్పిస్తే పెంపొందు నాత్మవిశ్వాసం

ఆసరానిడితే ఎన్నో విజయాలు వారి సొంతం

స్ఫూర్తివంతమైన వారి కథలు వింటూ ఉందాం!

చేయిచేయి కలిపి చేద్దాం వారితో స్నేహం!

తోడునీడగా నడిస్తే తొల్గిపోవు నైరాశ్యం

వెలుగు నింపగా వారి బ్రతుకుల్లో సంతోషం

నిండిపోవగా నిలిచియుండు నిత్యవాసంతం.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational