అందమైన మనసు...
అందమైన మనసు...
అందమైన మనసు
పున్నమి పూలతోటలో విహరించే మనసు
అందమైన ఊహలలో తేలిపోయే మనసు
విరజాజుల గంధాలతో నిండిన మనసు
విరితేనెలు పూసుకున్న మనసు
అలలా గగనము తాకిన మనసు
కలలా కనుల నిండిన మనసు
మాయలు ఎరుగని మనసు
మరువమంటి పరిమళంతో నిండిన మనసు
ఆశలపల్లకిలో ఊరేగే మనసు
మధురగీతాలు ఆలపించే మనసు
మలయ పవనాలను తాకిన మనసు
శరత్కాలపు వెన్నెలలో వన్నెలద్దుకున్న మనసు
మల్లెపూవంటి తెల్లని స్వచ్ఛమైన మనసు
అదే నీ చూపులోని చల్లదనంనీ మాటలోని తీయదనం
నీ శ్వాశలోని వెచ్చదనం
మరల మరల చూడాలనిపించే నీ అందం
నా మదిని దోచిందంటే నమ్మవా కోమలి
పొగిడానని మరీ అంతలా గారాలు పోమాకే
ఇది కూడా బాగానే ఉందిలే...
... సిరి ✍️

