అందమైన కలా
అందమైన కలా
పున్నమి పూలతోటలో విహరించే మనసు
తామసి ఛాయలు తాకని మనసు
కలతనిండని మనసు
అందమైన ఊహలలో తేలిపోయే మనసు
విరజాజుల గంధాలతో నిండిన మనసు
విరితేనెలు పూసుకున్న మనసు
అలలా గగనము తాకిన మనసు
కలలా కనుల నిండిన మనసు
మాయలు ఎరుగని మనసు
మరువమంటి పరిమళంతో నిండిన మనసు
ఆశలపల్లకిలో ఊరేగే మనసు
మధురగీతాలు ఆలపించే మనసు
మలయ పవనాలను తాకిన మనసు
శరత్కాలపు వెన్నెలలో వన్నెలద్దుకున్న మనసు
మల్లెపూవంటి తెల్లని స్వచ్ఛమైన మనసు..
... సిరి ✍️

