అమ్మో ఈ అమ్మడు గుమ్మడి పువ్వా!
అమ్మో ఈ అమ్మడు గుమ్మడి పువ్వా!
భూమ్యాకాశాలు కలిసిపోయి
ముస్తాభైనట్లు....
సూర్యచంద్రులు ఒకే కక్షలో
తారసపడినట్లు...
అందం అనంతం అక్కడే
ఆవిష్కృతమైనట్లు...
ప్రకృతి సర్వస్వం చిక్కనై
చక్కగా నిలుచున్నట్లు
ఎక్కడనుండి వచ్చిందో
ఈ నక్షత్రాల నాయికామని
లెక్కలేనంత సౌందర్యం
మిక్కిలి ఆసక్తినిరేపే
సాంస్కృతి... సాంప్రదాయం
నవభారత దక్షిణ కన్యకా కావ్యం
జ్యోతి సహితం ప్రజ్వలించాడానికి
ఆమెను చూసి మోహమాటపడిందా
ఆమె ముఖారవిందంతో....
జ్యోతి జ్వలిస్తూ తేజోమయమయ్యిందా
కళ్ళలో కాంతిపుంజాలు
ఒక్కటి కాదు రెండుకాదు
ఖగోళ శాస్త్రాలు ఎన్ని తిరిగేసినా
లెక్కించలేము...కవి కలాన్ని
ఒప్పించలేము చిత్రకారుని కుంచెను
మెప్పించలేము...ఆమ్మో!!
ఈ అమ్మడు గుమ్మడి పువ్వా!!!
ఒట్టు ఈ 'కుట్టి' సౌందర్యం
ప్రతి సౌందర్య పిపాసి మనసును కొట్టి
మరీ కుట్టి తీరుతుంది.
అమ్మ తోడు చంద్రయాన్-2కి
ఈ ముద్దగుమ్మని పంపివుంటే
చందమామ అంత దురుసుగా కాకుండా
సున్నితంగా అక్కున చేర్చుకునేవాడు
మనకు నిజంగా మామై వియ్యమందేవాడు
నిశిరాత్రినీ... అరుణోదయ నక్షత్రం చేసిన
ఈ చారులత ముఖారాద్ధం ముందు
సన్నీలియోన్ సహితం నిలబడి
అందం-ఆరోగ్యం చిట్కాలు
ఒక్కొక్కటీ నేర్చుకోవాల్సిందే