STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

అమ్మేశారు

అమ్మేశారు

1 min
339

మా అభిమానాన్ని అమ్మేశారు

మా సమాచారాన్ని అమ్మేశారు


మా ఈమెయిల్సు 

మా ఆలోచనా విధానాలు

మా అలవాట్లు

అన్నీ అమ్మి పడేసారు


ఏమన్నా అంటే

గోప్యత అంటారు

కాసేపటి తరువాత

నే చెప్పిందే కొను అంటారు


అంతా బాగానే ఉందనుకోవాలా

అంతే కదా

నువ్వు తిరిగే స్థలాలు,

వెతికే పదాలు,

కొనాలనుకునే వస్తువులు,

నీ వ్యక్తిగత సమాచారం,

అంతా వాళ్ళ సర్వర్లలో ఉందని సంతోషపడతావో

నీ ఆలోచనా స్వేచ్ఛను ఎప్పుడో వెల కట్టి 

అమ్మేసుకుంటున్నారని బాధపడతావా

నీకు నువ్వే సంతాపం తెలుపుకుంటావా

ఏమో

అది కూడా సెర్చ్ ఇంజిన్ నే అడుగుతావా 

#SMBoss



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract