అమ్మా నీ ఆశీర్వాదం
అమ్మా నీ ఆశీర్వాదం
అంతా తెలుసనుకున్నాను
ఏదైనా సాధ్యం అనుకున్నాను
కానీ కాలం గురించి మరిచాను
మా అమ్మే కదా
ఎక్కడికి పోతుంది అని నిర్లక్ష్యం చేశానా
అమ్మా
నువ్వు లేవని బాధపడాలా
అంతేనా
కాదు
తల్లినీ బిడ్డనూ వేరు చేసే శక్తి లేదు కదూ
నువ్వు నా కంటికి కనిపించవు
కానీ అమ్మా
నీ జ్ఞాపకాలు నా శ్వాసల్లో వినిపిస్తాయి
అమ్మా
నీ ఆశీర్వాదంతో నేను ముందుకు వెళతాను
నా నీడలా తోడు నువ్వు వస్తావని ధైర్యంగా ముందడుగు వేస్తాను.
