STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

అమ్మా అని ఎవ్వరిని పిలిచేదిక?

అమ్మా అని ఎవ్వరిని పిలిచేదిక?

1 min
338

లోకములంతటికీ తల్లివి నీవు

నా తల్లి ఆయువును తీసుకెళ్ళావు

అమ్మా అని ఎవ్వరిని పిలిచేదిక

అమ్మ జోల పాట నేనెట్లు మరిచేదిక


ఏమని పాడను నీ లీలలు

శివా

ఒంటిగా ఒక్కడివే ఉంటావట

కానీ అందరిలో ఉండేది నేవెనట


విషమును నీవు తాగేస్తివంట

నీ చూపులే అమృతమంట

భక్తుల ఎంగిలి నీకు ఔషధమంట

నందినెక్కి కాష్టాల కాడ తిరుగుతావంట


నువ్వేమైనా అనుకో

అమ్మా అని నే నిన్నే పిలుస్తానిక

నువ్వు పలకకుండా ఉండగలవా అంటా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract